English   

నానిని చూస్తుంటే గర్వంగా ఉందన్న వెంకటేష్ !

venky
2019-04-16 09:08:15

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్ సినిమా యూనిట్ కి అండగా నిలిచాడు. ఈ సందర్భంగా వెంకటేష్, నాని క్రికెట్ ఆడి సభికులను అలరించారు. నాని బౌలింగ్ చేయగా వెంకీ బ్యాటింగ్ చేస్తూ బంతిని ప్రేక్షకుల వైపు కొడుతూ వారిలో మరింత ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.    ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నాకు క్రికెట్ ఇష్టం కాబట్టి ఈ వేడుకకు రాలేదు. ఇక్కడకు రావడం వెనక జెన్యూన్ రీజన్ ఉందని చెప్పుకొచ్చాడు. జెర్సీ ఫస్ట్ లుక్ చూసినప్పటి నుంచే ఇంప్రెస్ అయ్యానని. ట్రైలర్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించిందని వెంకీ చెప్పుకొచ్చారు. అలాగే డైరెక్టర్ గౌతమ్ తాను ఏం చెప్పాలనుకున్నాడో ఈ సినిమా ద్వారా స్పష్టంగా చెప్పబోతున్నట్లు అనిపించిందని అన్నారు. ఇలాంటి సినిమాలు  అరుదుగా వస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరు లైఫ్‌లో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కాని జీవితంలో వాటిని ఎదుర్కొని ఎలా నిలదొక్కుకున్నారన్నదాన్ని ‘జెర్సీ’లో నాని చూపించబోతున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి నేచురల్ యాక్టర్ ఉన్నందుకు  గర్వంగా ఉందని వెంకీ చెప్పుకొచ్చారు

More Related Stories