English   

జబర్దస్త్ ని వదిలే ప్రశక్తే లేదు !

Naga Babu
2019-04-16 11:20:07

బుల్లితెర లో ప్రసారమవుతున్న షోలలో నెం1 స్ధానంలో ఉంది జబర్ధస్త్. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్లు వచ్చారు. ఈ షో మొదలయిన నాటి నుండి న్యాయనిర్ణేతలుగా మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజాలు వ్యవహరిస్తున్నారు. అయితే వీరిద్దరూ ఇటివలే జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడంతో కొద్ది రోజులుగా షోకు రావడం లేదు. వీరి స్ధానంలో శేఖర్ మాస్టర్, సీనియర్ హీరోయిన్ మీనాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. రోజా, నాగబాబు ఇకపై జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఈ విషయం మీద నాగబాబు స్పందించారు. జబర్ధస్త్ అంటే తనకు చాలా ఇష్టం అని ఈ షోవల్ల తాను చాలా లాభంపొందానని చెప్పారు. ఆర్ధికంగా, కెరీర్ పరంగా జబర్ధస్త్ చాలా ఉపయోగపడిందని అలాంటి దానిని ఎట్టి పరిస్ధితుల్లో వదులుకోబోనని నెలకు నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ ఉటుందని ఒక వేళ ఎంపీగా గెలిచినా ఎలాగోలా ఆ నాలుగు రోజులు సర్దుబాటు చేసుకుంటానని అయన క్లారిటీ ఇచ్చారు. తాను తిరిగి జబర్దస్త్ షోలో త్వరలోనే కనిస్తానని నాగబాబు తెలిపారు. 

More Related Stories