English   

జెర్సీకి సెన్సార్ క్లీన్ సర్టిఫికేట్ !

Jersey
2019-04-16 12:51:35

నేచురల్ స్టార్ నాని హీరోగా మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ నేపధ్య మూవీ జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్‌ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది రెండు ప్లాప్స్ తో అభిమానులను నిరాశ పరిచిన నాని..జెర్సీ మూవీ తో గట్టి నమ్మకాలే పెట్టుకున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌ ట్రైలర్‌లకు మంచి స్పందన రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు ఎలాంటి కట్స్ ఇవ్వకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసారు. ఇక ఈ సినిమాలో నాని 36 ఏ‍ళ్ల వ్యక్తిగా అది కూడా ఓ కుర్రాడికి తండ్రిగా, క్రికెటర్ గా కనిపించనున్నాడు, ఇక నానికి జోడీగా కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తోంది. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ మీద సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. 

More Related Stories