English   

నితిన్ కోసం అఖిల్ హీరోయిన్ !

Kalyani Priyadarshan
2019-04-16 18:38:11

యంగ్ హీరో నితిన్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు ఈ యంగ్ హీరో ఛలో దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు భీష్మ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే రష్మికా మందనను తీసుకున్నారు. అయితే సెకండ్ హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నట్లు తెలిపింది సినిమా యూనిట్. కళ్యాణి ప్రియదర్శిన్ తెలుగులో ముందు అఖిల్ నటించిన హలో మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ కాకపోయినా కళ్యాణి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ అమ్మడు తాజాగా సాయి ధరమ్ తేజ్ సరసన చిత్రలహరి మూవీలో నటించింది. ఈ సినిమా మంచి హిట్ కొట్టి  బాక్సాఫిక్ వద్ద భారీ కలెక్షన్లను కూడా రాబడుతోంది. చిత్రలహరి సినిమా విజయం సాధించడంతో నితిన్ సరసన నటించే చాన్స్ కళ్యాణి కొట్టేసిందని అంటున్నారు. నితిన్ ఈ సినిమాతో నైనా హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి మరి.

More Related Stories