English   

విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా తమిళమ్మాయి  !

Vani Bhojan
2019-04-17 09:29:41

సెస్సెషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో మంచి పేరు తెచ్చుకుని అర్జున్ రెడ్డితో స్టార్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం, ట్యాక్సివాలా లాంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలతో టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని తెచ్చుకున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందాన మనోడు ఫేం ఉన్నప్పుడే నిర్మాణం కూడా చేస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన పెళ్లి చూపులు మూవీ దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాకు నూతన దర్శకుడు సమీర్ దర్శకత్వం వహిస్తుండగా కొద్ది రోజుల నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గురించి రకరకాల వార్తలు వినిపించాయి. అనసూయ లాంటి పేర్లు వినిపించినా ఫైనల్ గా తరుణ్ భాస్కర్ సరసన తమిళ టెలివిజన్ సంచలనం అయిన నటి వాణి బోజన్ ను హీరోయిన్ గా తీసుకున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. తనకు ఈసినిమాలో అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండకు ధన్యవాదాలు అంటూ తన సోషల్ మీడియాలో ప్రకటించింది వాణి. ఈసినిమా ద్వారా తాను తొలిసారిగా తెలుగు వాళ్లకు పరిచయం అవుతున్నట్లు తెలిపింది వాణి. ఆమె ఈ సినిమాతో పాటు మరో రెండు తమిళ సినిమాల్లో కూడా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు.

More Related Stories