English   

రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ నటి పూజా !

Pooja Ramachandran
2019-04-17 10:19:00

బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన బ్యూటీ పూజా రామ చంద్రన్ రెండో వివాహం చేసుకుంది. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ దేవి శ్రీ ప్రసాద్, దోచెయ్ లాంటి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలే చేసినా ఆమెకు పేరు రాలేదు. ఎస్ ఎస్ మ్యూజిక్‌ చానల్ లో వీజేగా కెరియర్ స్టార్ చేసిన పూజా రామ చంద్రన్ తోటి వీజేతో ప్రేమలో పడి ఆయన్నిపెళ్లి కూడా చేసుకుంది. అయితే రెండేళ్ళు కలిసి ఉన్న వారు మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో నటుడు జాన్ కొక్కెన్‌తో సన్నిహితంగా ఉంటూన్న పూజా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆమె చాల సార్లు ఖండించింది. అయితే అనూహ్యంగా అతడినే రెండో పెళ్లి చేసుకుంది పూజా. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. జాన్ కొక్కెన్ గతంలో మీనా వాసుదేవన్ అనే నటిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది పూజా..దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. 

More Related Stories