English   

ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు సీరియల్ నటులు మృతి !

 anusha reddy
2019-04-17 10:35:47

హైదరాబాద్ సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సీరియల్ నటీమణులు మరణించిన ఘటన కలకలం రేపుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం సీరియల్ షూటింగ్ నిమిత్తం వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లిన సదరు సీరియల్ టీమ్ నిన్న అర్ధరాత్రి దాటాక తిరుగుప్రయాణమై వస్తున్న సమయంలో చేవెళ్ల సమీపంలోని మొయినాబాద్ అప్పారెడ్డి గూడ బస్టాప్ వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయిన వీరి కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గురయిన కారులో నలుగురు ప్రయాణిస్తుండగా, నిర్మల్‌ కి చెందిన భార్గవి(20), భూపాలపల్లి జయశంకర్‌ జిల్లాకు చెందిన అనుషారెడ్డి (21) మరణించారు. భార్గవి అక్కడికక్కడే మరణించగా అనుషా రెడ్డి మాత్రం మార్గ మధ్యంలో చనిపోయిందని అంటున్నారు. ఇక కారు డ్రైవర్‌ చక్రితో పాటు మరో వ్యక్తి వినయ్‌ కుమార్‌ లకు తీవ్ర గాయాలు కాగా, వీరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

More Related Stories