English   

జయలలిత బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల !

Sasi Lalitha
2019-04-17 10:45:29

అన్ని బాషలలో ఇప్పుడు బయోపిక్స్ సీజన్ నడుస్తోంది. అలా వస్తున్న బయోపిక్స్ దాదాపుగా అనీ బాగానే ఆడుతుండడంతో ఈ జోనర్ మీద ద్రుష్టి పెడుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా తమిళనాడు మాజీ సీఎం జయలిత మీద బయోపిక్స్ వెల్లువలా తెరకేక్కుతున్నాయి. ఆమె మీద ఏకకాలంలో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ కంగనా రనౌత్‌ లీడ్ రోల్‌ లో తలైవి అనే సినిమా రూపొందిస్తుండగా, సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ ఐరన్ లేడీ అంటూ సినిమా చేస్తున్నారు. ఇక వీటితో పాటుగా తెలుగు వాడు అయిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా జయలలిత బయోపిక్‌ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ కూడా విడుదల చేశారు కేతిరెడ్డి. జయలలిత, శశికళను ఒరిజినల్ ఫొటోలను అర్ధనారీశ్వర పంధాలో మిక్స్ చేసి చూపించారు. అలాగే ఆ ఫస్ట్ లుక్ కి న్యాయం చేసేలా శశి లలిత టైటిల్‌ పెట్టారు. ఇక ఈ సినిమాలో జయలలిత పాత్రని బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్, శశికళ పాత్ర అమలా పాల్‌ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాతో పాటు కేతిరెడ్డి లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు.

More Related Stories