English   

తేజ్ కి మరో మేనమామ ప్రశంశలు !

Pawan Kalyan
2019-04-17 16:21:19

నడి వేసవిలో మిట్ట మధ్యాహ్నం చల్లటి నిమ్మకాయ సోడా తాగితే ఎలా ఉంటుందో అలా ఉంది వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్‌ కి చిత్ర‌ల‌హ‌రి ఇచ్చిన ఫలితం. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ఎక్స్పెర్ట్ గా ప్రేక్షకుల్లో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న కిషోర్ తిరుమల ఈ సినిమాని తెర‌కెక్కించారు. విజయ్ పాత్రలో సాయి తేజ్ తనదైన పరిణితితో నటించాడు.  ఈ చిత్రం సూప‌ర్‌హిట్ టాక్‌తో విమ‌ర్శ‌కుల, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినిమా చూసిన వారందరూ యూనిట్‌ ను అభినందిస్తున్నారు. ఈ మధ్యనే సినిమా చూసిన తేజ్ మేనమామ  చిరంజీవి సాయితేజ్‌, నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడ్ని అభినందిస్తూ ఓ వీడియో సందేశం పంపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను చూసిన ప‌వ‌న్‌ క‌ల్యాణ్ సినిమా బాగా న‌చ్చ‌డంతో యూనిట్‌ను అభినందిస్తూ చిత్ర యూనిట్‌కు ఫ్ల‌వ‌ర్ బొకేల‌ను పంపారు. `కంగ్రాట్స్ .. మీ వ‌ర్క్‌ను నేను ఎంతో బాగా ఎంజాయ్ చేశాను` అంటూ బొకే మెసేజ్ కూడా పంపారు పవ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

More Related Stories