English   

నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాని ?

Nani
2019-04-17 16:45:20

టాలీవుడ్ హీరోలు నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓ మల్టీ స్టార‌ర్ తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వీలయిన్నంత త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. నానితో అష్టా చమ్మ, సుధీర్ బాబుతో సమ్మోహనం తెరకెక్కించిన మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమా తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో నాని సరసన నాయికగా అదితీ రావ్ హైదరీని  సుధీర్ బాబు సరసన నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి వ్యూహం అనే టైటిల్‌ ప‌రిశీలిస్తున్నార‌ని అంటున్నారు. ఈ చిత్రంలో నాని పాత్ర నిడివి తక్కువే అయినా చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని భోగట్టా. ఇక ఈ సినిమాలో నాని నెగెటివ్ పాత్ర చేయ‌బోతున్నాడట, అప్పుడెప్పుడో రైడ్ సినిమాలో కాసేపు నెగటివ్ గా కనిపించిన నాని ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నాడు.  

More Related Stories