English   

మా లో ముసలం...వైఎస్ ప్రెసిడెంట్ గా ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా !

Krishna Reddy
2019-04-17 18:00:59

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటయ్యి ముచ్చటగా మూడు వారాలు కూడా పూర్తి కాక మునుపే అందులో ముసలం పుట్టినట్టుంది. తాజాగా మా ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి తాజాగా ఎన్నికయిన ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. మా లోని నిధులు పక్క దారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఎస్వీ కృష్ణారెడ్డి మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మా ఎన్నికల్లో ఎక్కువ వోట్లు సాధించి గెలిచి మూడు వారాలకు మునుపే రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్ అవుట్ డోర్ షూటింగ్ లో వున్నారు. ఆయన తిరిగి వచ్చాక ఈ వ్యవహారం మీద క్లారిటీ రావచ్చని అంటున్నారు. అయితే ఈ ప్యానెల్ అంతా దాదాపు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కు మద్దతుగానే ఉన్నారు. అయినా వీరిలో లుకలుకలు బయటపడడం కలకలం రేపుతోంది.

More Related Stories