English   

శ్రీ రెడ్డి పోరాటానికి దిగి వచ్చిన తెలంగాణా సర్కార్ !

srireddy
2019-04-17 20:13:36

సినీ ప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేధింపులు స‌హ‌జ‌మే అని పాకుడు రాళ్ళ సమయం నుండే అంది మనస్సులో నాటుకుపోయింది. కానీ తప్పో ఒప్పో అన్నిటికీ తెగించి లైంగిక‌ వేధింపుల‌పై పోరాటాన్ని కొన‌సాగించి అన్ని వర్గాల నుండి మద్దతు అందుకుంది న‌టి శ్రీ‌రెడ్డి. ఆమె పోరాటం మొదలు పెట్టిన నాడు ఆమె పోరాటానికి మ‌ద్ద‌తు తెలిపిన వారి సంఖ్య వేల‌పై లెక్క‌పెట్ట‌వ‌చ్చు. సినీ పెద్ద‌ల‌కు భ‌య‌ప‌డో త‌మ‌కు అవ‌కాశాలు రావ‌నో చాలా మంది ఈ పోరాటానికి ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ద‌తు తెల‌ప‌పోయినా ప‌రోక్షంగా మ‌ద్ద‌తు తెలిపిన‌వారు ఉన్నారు. తప్పో ఒప్పో కానీ మ‌హిళ‌ల‌కోసం ఆమె అర్థ‌న‌గ్న పోరాటం కూడా చేసింది. ఎట్ట‌కేల‌కు శ్రీ‌రెడ్డి శ్ర‌మ ఫ‌లించింది..టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని ఆమె కొన్నాళ్ల క్రితం చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్యానల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ప్యానల్ ఏర్పాటుకు సంబంధించి జీవోను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 984 ప్రకారం సినీ నటి సుప్రియ,  యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను తెలంగాణ ప్రభుత్వం ఈ కమిటీలో టాలీవుడ్‌ ప్రతినిధులుగా నియమించింది. ఇక బయట నుండి నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మిలను కూడా ఈ కమిటీలో భాగం చేసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు, తమ్మారెడ్డి భరద్వాజ, సుధాకర్ రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. ఇక రామ్ మోహన్ రావు ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

More Related Stories