English   

రెండు ఆకాశవాణులు...ఏమవుతుందో ?

two films are going be released same title
2019-04-17 20:42:41

ఒకే టైటిల్ తో కానీ దగ్గర దగ్గరగా ఉన్న పేర్లు ఉన్నా కానీ సినిమాల మీద జనాల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఆ విషయం వివాదాస్పదం అవుతుంది. ఒకప్పుడు మహేష్ బాబు ఖలేజా విషయంలో, కళ్యాణ్ రామ్ కత్తి విషయంలోనూ ఇదే ఎదురయ్యింది. ఇక తాజాగా హీరో నిఖిల్ ముద్ర సినిమా కూడా అదే ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక అలాంటి పరిస్థితులే మరో సినిమాకి ఎదురయ్యేలా ఉంది. అదేంటంటే రాజమౌళి కొడుకు నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీరవాణి తనయుడు కాల భైరవ ఈ సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా, అశ్విన్‌ గంగరాజు అనే యువకుడుగా దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా నిన్ననే గుమ్మడి కాయ కూడా కొట్టేసారు, దానిఇకి ఆకాశవాణి అనే టైటిల్ కూడా పెట్టుకున్నారు. అయితే తాజాగా 'ఆకాశవాణి' టైటిల్‌తో మరో సినిమా తెరపైకి వచ్చింది. సతీష్‌ బత్తుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ ఈ నెల 17న రిలీజ్‌ చేస్తున్నామంటూ ఈ టైటిల్‌ లోగోతో కూడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. దీంతో ఈ టైటిల్స్ యవ్వారం బయటకు వచ్చింది. అయితే ఒకటి ఆకాశవాణి అని ఉండగా మరొకటి మాత్రం ఆకాశవాణి విశాకపట్నం కేంద్రం అని ఉంది. ఈ టైటిల్స్ వ్యవహారం ఎండాకా వెళుతుందో చూడాలి.

More Related Stories