English   

నటిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న దర్శకుడు !

Naveen reveals why he and actress Sindhu only chose to go in for a registered wedding
2019-04-17 20:58:57

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్ళిళ్ళు సర్వ సాధారణం. దాదాపు అన్ని ప్రేమలూ పెళ్ళిళ్ళ దాకా వెళ్ళవు, పెళ్లి దాకా వెళ్ళిన ప్రతి సారి నిలుస్తుందన్న నమ్మకం లేదు. కానీ కోలీవుడ్ లో దర్శకుడిగా పనిచేస్తున్న  నవీన్, నటి సింధు రెడ్డి నిన్న సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం చర్చనీయంసాం అయింది.  దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్న నవీన్ తొలి సారిగా మోదర్ కోడం అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు నవీన్ పలు చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. నూతన నటీనటులతో తెరకెక్కించిన మోదర్ కోడం చిత్రానికి ప్రశంసలు దక్కాయి. ఆ చిత్రానికి నిర్మాత కూడా నవీనేకాగా ఈ సినిమాలో ఇప్పుడు వివాహం చేసుకున్న సింధు రెడ్డి కూడా నటించింది. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య పుట్టిన స్నేహం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది.

More Related Stories