English   

భీష్మకి ఒక్కరే హీరోయిన్ అట...కళ్యాణి లేనట్టేనా ?

rashmika
2019-04-17 21:25:49

శ్రీనివాస కళ్యాణం కొట్టిన దెబ్బకు చాన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు ఓకే సారి మూడు సినిమాలు ఒప్పుకుని వాటిని త్వరలో పూర్తి చేసుకుని రిలీజ్ చేసుకునే పనిలో పడ్డాడు. ఈ మూడింటిలో ముందుగా భీష్మ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకి శౌర్యతో ఛలో సినిమా తీసిన వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నాడు. 'ఛలో' సినిమా మంచి లవ్ స్టోరీ కాగా నితిన్ సినిమా కూడా లవ్ స్టోరీ అనే అంటున్నారు. ఇక ఈ సినిమాలో దర్శకుడి మొద్దటి సినిమా ఛలో సినిమాలో నటించిన రష్మికనే ఫైనల్ చేశారు. అయితే నిన్నటి నుండి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు కల్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఒక కథానాయిక మాత్రమే ఉంటుందనీ, ఆ పాత్రకి రష్మికను తీసుకోవడం జరిగి పోయిందని ఆయన క్లారిటీ ఇచ్చాడు. కల్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేసుకున్నామనే వార్తలో నిజం లేదని స్పష్టం చేశాడు. ఈ సినిమాకి సంబంధించి మిగతా నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే అందిస్తామని ఆయన తన ట్విట్టర్ లో ప్రకటించాడు.

More Related Stories