English   

ఇద్దరు భర్తలా...అంత స్వాతంత్ర్యం మాకు అక్కర్లేదమ్మా ?

actress kasthuri make sensational comments
2019-04-17 21:46:26

ఈ మధ్య కాలంలో నటన తగ్గించి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కస్తూరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహిళలకి ఇద్దరు భర్తలు అవసరం లేదని ఒకరు చాలని, అంత స్వతంత్రం మహిళలు కోరుకోరని కస్తూరి వ్యాఖ్యానించింది. అమెరికాలో నివాసముంటున్న చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆరోగ్యసామి నిర్మించి, దర్శకత్వం వహించి హీరోగా నటించిన ముడివిల్లా పున్నగై సినిమా సోమవారం చెన్నై ప్రసాద్‌ ల్యాబ్‌ లో ట్రైలర్ రిలీజ్ మరియి ఆడియో రిలీజ్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు వేలు ప్రభాకర్‌ మాట్లాడుతూ ఇది పురుష సమాజమని, ఒక వ్యక్తి ధైర్యంగా ఇద్దరు భార్యలను వివాహం చేసుకోవచ్చని కానీ మహిళలు ఇద్దరు మొగుళ్లను వివాహం చేసుకొని వారానికి రెండ్రోజులు ఇక్కడా, రెండ్రోజులు అక్కడా ఉంటే ఈ సమాజం వారిని ఎలా చూస్తుందో ఒకసారి ఆలోచించాలని ఆయన మహిళల పట్ల తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలపై కస్తూరి స్పందిస్తూ, అంత స్వాతంత్య్రం తమకు అవసరం లేదని, మహిళలను మహిళలుగా గౌరవిస్తే చాలని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు తమిళ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.

 

More Related Stories