English   

ఫిలిం సిటీలో బిజీగా ఉన్న మామా అల్లుళ్ళు 

Venky Mama
2019-04-18 11:09:47

నిజజీవితంలో మామా అల్లుళ్ళు వెంకీ-చై రీల్ లైఫ్ లో కూడా మామా అల్లుళ్ళుగా నటిస్తున్న సినిమా వెంకీ మామ. జై లవ కుశ ఫేం రవీంద్ర(బాబి) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సురేశ్ ప్రొడక్షన్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఇక ఈ సినిమాలో వెంకటేశ్‌ కు జంటగా పాయల్ రాజ్ పుత్, నాగ‌చైత‌న్యకి జంటగా రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇటీవలే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ షూటింగు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలయిందట. వెంకీ-చైల మీద వచ్చే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారని అంటున్నారు. ఈ షూట్ లో వెంకటేశ్, నాగచైతన్యలతో పాటు 100 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. గ్రామ రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సీన్స్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు సినిమా యూనిట్. ఇక ఈ సినిమాలో చై మిలిటరీలో పనిచేస్తుండగా వెంకటేష్ ఊరిలో ఉండే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాని ఈ ఏడాది దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు దర్శకనిర్మాతలు.

More Related Stories