English   

సీక్వెల్స్ మీద పడ్డ విశాల్ !

Vishal
2019-04-18 16:28:11

ఈ మధ్య కాలంలో అన్ని బాషల సినీ పరిశ్రమల్లో బయుపిక్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది బోర్ కొట్టిందో ఏమో కానీ కొత్తగా సీక్వెల్స్ ట్రెండ్ కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే తెలుగులో నాగార్జున రెండు సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్ చేస్తుంటే, తమిళ్ లో కమల్ హాసన్ కూడా భారతీయుడు సీక్వెల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో హీరో కూడా వీరి బాటలోనే నడవాలని చూస్తున్నట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అన్నీ హిట్స్ తోనే ఫాంలో ఉన్న హీరో విశాల్ ఇప్పుడు ఇరుంబు తిరై తెలుగులో అభిమన్యుడు సినిమాకి సీక్వెల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అయి రెండు చోట్లా మంచి కలెక్షన్స్ సాధించింది. అందుకే ఆయన ఈ సీక్వెల్ మీద ద్రుష్టి పెట్టినట్టు చెబుతున్నారు. అయితే ఈ సీక్వెల్ కి మొదటి భాగం తెరకెక్కించిన మిత్రన్ కాకుండా ఆనంద్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. ఇక విశాల్ సీక్వెల్ ఇదోక్కట్టే అనుకుంటే మీరు పొరబడినట్టే ఈ సినిమా వచ్చే రిజల్ట్ తో ఆయన మరో సీక్వెల్ చేయాలని భావిస్తున్నాడు. గతంలో విశాల్ చేసిన తుప్పరివాలన్ తెలుగులో డిటెక్టివ్ సినిమా కూడా రెండు భాషల్లోను విజయాలను అందుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా ‘తుప్పరివాలన్ 2’ పేరుతో మరో సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నారు. చూడాలి మరి మొదటి సినిమా రిజల్ట్ ఏమవుతుందో ? రెండో సినిమా మొదలవుతుందో లేదో ?

More Related Stories