English   

వర్మ మరో బయోపిక్...ఈ సారి కేసీఆర్ ది 

Ram Gopal Varma
2019-04-18 16:35:17

తెలుగు నాట బయోపిక్‌ లకి ఆదరణ దక్కకున్నా, కొంతమంది దర్శకులు ఇంకా ప్రముఖ వ్యక్తుల జీవితాలను బయోపిక్స్ గా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. తాజాగా తెలంగాణ సీఎం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్‌ బయోపిక్‌ను కూడా తరువాత చిత్రంగా తియ్యబోతున్నట్టు చాలా రోజుల క్రితం ప్రకటించిన వర్మ ఈరోజు ఆ సినిమా టైటిల్ ను ప్రకటించారు. ‘కేసీఆర్ టైగర్.. ది అగ్రెసివ్ గాంధీ’ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టినట్లు వర్మ ట్విట్టర్ లో ప్రకటించారు. అంతేకాక ఈ సినిమా ఈ టైటిల్ కు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనే ట్యాగ్ లైన్ ను పెట్టారు. ఈ టైటిల్ షేర్ చేసిన వర్మ ఇది కేటీఆర్ తండ్రి బయోపిక్ అని, ఆయన ఆంధ్రా వాళ్ళు తెలంగాణా వాళ్ళను చూస్తున్న చిన్నచూపు నుండే ప్రత్యేక తెలంగాణా తెచ్చే ఉద్యమకారుడిగా మారాడని పేర్కొన్నాడు. 

More Related Stories