English   

వర్మకి కేసీఆర్ అంటే భయమా ? ప్రేమా ?

RGV
2019-04-18 18:38:27

తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సీఎం కేసీఆర్‌ మీద అప్పట్లోనే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో ప్రేమ చూపించాడు. సినిమా హీరోయిన్ల కన్నా కేసీఆరే అందంగా ఉంటారని నేను ఎప్పుడు నమ్మేవాడిని, కానీ తాజా విజయం చూస్తే కేసీఆర్‌ సినిమా హీరోల కన్నా కూడా అందగాడని, హిమాలయాలకన్నా ఆకర్షణీయుడని అనిపిస్తోంది’ అని అప్పట్లో ఆకాశానికి ఎత్తేశారు. ఈ క్రమంలో ఈమధ్య కేసీయార్ మీద బయోపిక్ తీస్తానని ప్రకటించిన వర్మ ఈరోజు దాడ్ని టైటిల్ కూడా ప్రకటించాడు. అయితే కాంట్రవర్సీలతోనే సగం ప్రమోషన్స్ చేసుకుని సక్సెస్ కొట్టేసే వర్మ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ మీద పడడం కాస్త ఆశ్చర్యకరమే. వర్మ టైటిల్ గమనిస్తే ఆయన ఎవరినీ నొప్పించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో స్పష్టం అవుతుంది. ఇక ది అగ్రెసివ్ గాంధీ అంటూ గాంధీకి ఆవేశమొస్తే ఎలా ఉంటుందో కేసీఆర్ కూడా అలాగే అంటూ కేసీఆర్ ని అభినవ గాంధీని చేసేశాడు వర్మ. ఇష్టమొచ్చినట్లు సిన్మా తీస్తే ఎక్కడ తంతే ఎక్కడ పడతాను అనుకున్నాడో ఏమో కానీ కెసీఆర్ బయోపిక్ వివరాలను చాలా పద్దతిగా ఏదో అంటు కట్టినట్టు ప్రకటించాడు.  

More Related Stories