English   

రగ్గ్డ్ లుక్ లో వరుణ్

varun
2019-04-18 21:42:11

మెగాహీరో వరుణ్‌ తేజ్‌ సినిమాలను చాలా బ్యాలెన్స్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన  ‘ఎఫ్‌2’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన వరుణ్‌. ప్రస్తుతం ఓ తమిళ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్‌ అయిన జిగర్తాండను తెలుగులో వాల్మీకి పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఒక గ్యాంగ్‌ స్టర్‌ సినిమాల మీద ఆసక్తితో రచయితగా ఎలా మారాడు అనే కాన్సెప్ట్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ నెగటివ్ పాత్ర ఉన్న్న గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించినట్లు వరుణ్‌, అలాగే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించారు. గబ్బర్‌సింగ్‌ లాంటి రీమేక్‌ ను తెలుగు తెరకు అందించిన హరీష్‌ శంకర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ చాలా రగ్గ్ డ్ లుక్ లో కనిపిస్తున్నారు. చెవికి పోగుతో ఆయన నిజంగా వాల్మీకీనా అన్నట్టు కనిపిస్తున్నారు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

More Related Stories