English   

తమిళ్ టెంపర్ - అయోగ్య ట్రైలర్ టాక్

Ayogya Official Trailer Talk
2019-04-20 08:03:33

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. దాంతో ఈ సినిమాను హిందీలోకి సింబా పెరుతి రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక తమిళంలో విశాల్ హీరోగా ఈ సినిమా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. వెంకట్ మోహన్ ఈ రీమేక్ కి ద‌ర్శ‌కుడు. రాశీఖ‌న్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.  హీరో పాత్రలోని వేరియేషన్స్ ను ఈ ట్రైలర్ ద్వారా చూపే ప్రయత్నం చేశారు. దాదాపు తెలుగు వెర్షన్‌నే ఫాలో అయిపోతూ, అక్కడక్కడా తమిళ నేటివిటీకి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు మాత్రమే చేసింది యూనిట్. ఇక్కడ ఎన్టీఆర్ ఇన్స్పెక్టర్  దయాగా కనిపిస్తే, అక్కడ విశాల్ ఇన్స్పెక్టర్ కర్ణగా కనిపించనున్నాడు. విశాల్ మాస్ యాక్షన్, ఫైట్స్, అతని మేకోవర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సీనియర్ ని నటుడు పార్థిబన్ చేస్తుండగా, పోసాని క్యారెక్టర్‌ ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ చేస్తున్నారు. లైట్ హౌస్ మూవీ మేకర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై, ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. తమిళంలోనూ ఈ సినిమా భారీ హిట్ కొడుతుందనే నమ్మకంతో విశాల్ వున్నాడు. మరి ఆయన అనుకుంటున్నట్టు ఈ సినిమా అక్కడ కూడా భారీ వసూళ్లు రాబడుతుందేమో చూడాలి.

 

More Related Stories