English   

మహేష్ సినిమాతో విజయశాంతి రీఎంట్రీ...అదే రోల్ ఆ ?

Vijayashanthi
2019-04-20 09:03:53

మహేష్ బాబు మహర్షి సినిమా షూట్ కంప్లీట్ అవడంతో ఆయన తన తదుపరి సినిమా మీద ద్రుష్టి పెట్టాడు. ఆయన తన తర్వాతి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేయనున్నారు. ఈ సినిమా ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు కానీ అనిల్ అయితే ఈ స్క్రిప్ట్ మీదే పని చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి రావడంతో మెల్లగా ఒక్కొక్క నటుడిని ఫైనల్ చేస్తున్నాడట. అయితే సినిమాలో ముఖ్య పాత్రల కోసం ఇప్పటికే విజయశాంతి, జగపతి బాబు, బండ్ల గణేష్ ఇలా వీరి ముగ్గురినీ అప్రోచ్ అయ్యారట. ఇందులో జగపతి బాబు మినహా మరో ఇద్దరూ ఇండస్ట్రీకి అందుబాటులోనే ఉన్నా నటనకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు అనిల్ వీరిద్దరినీ ఒప్పించాడని అంటున్నారు. అలా ఇద్దరూ ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. నిజానికి రానా, సాయిపల్లవి కాంబినేషన్లో దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న నక్సల్ బేస్డ్ పీరియాడిక్ సినిమాలో ఒక ముఖ్యమైన నక్సల్ పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించారట. అయితే మహేశ్ బాబు సినిమాలో పాత్ర సమాజం బాగు కోసం పరితపించే ఒక సోషల్ యక్తివిస్ట్ పాత్ర కావడంతో ఆమె వెంటనే ఒప్పుకున్నారట. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
 

More Related Stories