English   

కైరా అద్వానీ...ఈసారి అఖిల్ తోనా ?

  Kiara Advani
2019-04-20 09:11:00

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చాడన్న మాటే కానీ ఆయన స‌క్సెస్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర విజ‌యాల‌ను సాధించ‌లేదు. దీంతో అఖిల్ ఖాతాలోకి వరుసగా మూడు పరాజయాలు చేరిపోయాయి. దాంతో ఇప్పుడు చేయబోయే నాలుగవ సినిమాతో అయినా తప్పకుండా హిట్ అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు అఖిల్. అఖిల్ నాల్గొవ సినిమాకి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్  నిర్మించనుందట. ఈ సినిమాలో అఖిల్ సరసన ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చాలామంది హీరోయిన్స్ పేర్లు పరిశీలించి కైరా అద్వాని అయితే బాగుంటుందని ఆమెనే ఫైనల్ చేశారని సమాచారం.భ‌ర‌త్ అనే నేను సినిమాతో టాలీవుడ్ రంగ ప్ర‌వేశం చేసిన బాలీవుడ్ బ్యూటీ కైరా తన రెండవ సినిమా రాంచ‌ర‌ణ్‌తో విన‌య‌విధేయ రామ‌లో న‌టించింది. ఇలా రెండు పెద్ద ఫ్యామిలీల హీరోల స‌ర‌స‌నే న‌టించిన కైరా అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే  అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ జ‌త‌గా కూడా న‌టిస్తుందన్న మాట. 

More Related Stories