English   

పదమూడేళ్ళ తర్వాత మళ్ళీ సూపర్ హిట్ పెయిర్  

trisha
2019-04-20 09:23:15

ప్రస్తుతం రీమేక్స్ సీజన్ అన్ని బాషలలో నడుస్తోంది. ఇతర బాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను తమ తమ బాషలలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా అందాదున్ సినిమాని తమిళ్ లోకి తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక సీనియర్ యువ హీరోని, మరో సీనియర్ యువ్ హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారు ఎవరో కాదు, సిద్దార్ద్, త్రిషలు. సిద్ధార్థ్ .. త్రిష జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో 13 యేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో జంటగా కనువిందు చేసిన సిద్ధార్థ్ - త్రిష ఇద్దరూ మళ్లీ ఇంతకాలానికి కలిసి నటించనున్నారన్నమాట. త‌మిళ హిట్ మూవీ 96 తో త్రిష మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చేసింది. దీంతో ఆమెకి ఈ అవకాశం వచ్చినట్టు చెబుతున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories