English   

టైగర్ కేసీఆర్ ఫ‌స్ట్ లుక్...బాబుని ఉద్దేశిస్తూ వర్మ పాట !

RGV
2019-04-20 11:07:10

శివ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమా తీసిన వర్మ ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ సినిమాలు అంటే అవి కేవలం బయోపిక్స్ మాత్రమే అవుతున్నాయి. ఈ మధ్యనే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలో ఒక భాగం తీసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన వ‌ర్మ ప్ర‌స్తుతం రెండు బ‌యోపిక్‌ల‌ని ప్రకటించి వాటిని రూపొందించే ప‌నిలో పడ్డాడు. అందులో ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్‌ తో బయోపిక్ చేస్తుండ‌గా, ‘శశికళ’ పేరుతో కూడా జయలలిత శశి కళల జీవితాల మీద కూడా బ‌యోపిక్ రూపొందిస్తున్నాడు. అయితే కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మాన్ని ఎలా ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు అనే కాన్సెప్ట్ తో ఈ టైగర్ కేసీఆర్ తెరకెక్కిస్తున్నారు. అయితే టైగ‌ర్ కేసీఆర్ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల టైటిల్ లోగో విడుద‌ల చేశారు. టైటిల్‌కి అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అంటూ తెలుగులో క్యాప్షన్ కూడా పెట్టాడు. అయితే ఈ రోజు ఉద‌యం 11గం.లకి సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్రకటించిన వర్మ తాను పాడుతున్నట్టుగా ఉన్న ఒక వీడియోనే ఫస్ట్ లుక్ అంటూ విడుదల చేశారు.
మా బాష మీద నవ్వినావ్
మా ముఖాల మీద ఊసినావ్
మా బాడీల మీద నడిసినావ్ .....ఆంధ్రోడా 
వస్తున్నా...వస్తున్నా...వస్తున్నా... మీ తాట తియ్యనీకి వస్తున్నా...టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్ అంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ వర్మ పాడిన పాట హలైట్ గా నిలుస్తోంది. ఈరోజు చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నానని వర్మ ప్రకటించడం కూడా ఎన్ని వివాదాలకి దారి తీస్తుందో వేచి చూడాలి

More Related Stories