English   

నాని జెర్సీ ఫస్ట్ డే కలెక్షన్స్ !

Jersey
2019-04-20 12:16:04

కృష్ణార్జున యుద్ధం, దేవదాసు చిత్రాలతో కాస్త ఢీలాపడిన నేచురల్ స్టార్ నాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టిన జెర్సీ ఆ అంచనాలను అందుకుంది. పడిన మొదటి ఆట నుండే పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో జెర్సీకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. యూఎస్‌లో ప్రీమియర్ కలెక్షన్లలో కూడా ఈ సినిమా దూకుడు చూపిస్తోంది. ఈ సినిమా నిన్న ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.8కోట్ల గ్రాస్, రూ.5 కోట్ల షేర్ ని రాబట్టినట్లు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నాని కెరీర్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో జెర్సీ ఒకటిగా నిలిచిందని చెబుతున్నారు. నాని దూకుడు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్‌లో రూ.20కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

More Related Stories