English   

టైగర్ కేసీఆర్....వర్మ బాబు, లోకేష్ లను వదలడా ?

RGV
2019-04-20 13:08:31

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఇక వీడి పనైపోయింది అన్న నోళ్ళు అన్నీ మూయించాడు వర్మ. అయితే మరి ఆ సినిమా ఇన్స్పిరేషనో ఏమో కానీ ఈ సినిమా తర్వాత ఆయన మరో రెండు బయోపిక్స్ ప్రకటించాడు. ‘శశికళ’ బయోపిక్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్‌తో బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించడమే కాక ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాక ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు. అయితే ఈ సినిమా పేరుని, క్యాప్షన్ ని బట్టి కేసీఆర్ ని మునగచెట్టు ఎక్కించనున్నాడని ఊరికే అర్ధం అవుతోంది. అయితే ఈ సినిమాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వలన తెలుగుదేశం శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వర్మ ఇప్పుడు మళ్ళీ వివాదాలకు సిద్ధం అవుతున్నట్లు కన్పిస్తోంది. తాజాగా కేసీఆర్ బ‌యోపిక్‌లో కేటీఆర్‌, క‌ల్వ‌కుంట్ల క‌విత‌, చంద్ర‌బాబు నాయుడు, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌, హ‌రీష్‌రావు, వైఎస్సార్‌, వైఎస్ జ‌గ‌న్‌, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌, కె. రోశ‌య్య‌, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, రామోజీరావు, నారా లోకేష్ ల పాత్ర‌లువుంటాయ‌ట‌. ఆ మేర‌కు ఆర్జీవీ ట్విట్ట‌ర్ లో వివ‌రాలు అందించారు. అయితే అందరూ సరే ఇందులో  లోకేష్ పాత్ర ఎందుకు ఉన్నదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. వర్మ సైతం లోకేష్ ని పప్పు పప్పు అంటూ ట్విట్టర్ లో సంబోదిస్తూ ఉంటారు. నిజానికి తెలంగాణా ఉద్యమ సమయంలో నారా లోకేష్ అసలు పెద్దగా యాక్టివ్ గా లేరు. ఇప్పుడు ఇదే విషయం కాస్త ఆసక్తికరంగా మారింది.
 

More Related Stories