English   

షూట్ లో ప్రమాదం...హీరోకి గాయాలు !

Vicky Kaushal
2019-04-20 17:10:01

భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్త్రైక్స్ ప్రధానంశంగా వచ్చిన యురి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కి దేశ వ్యాప్తంగా క్రేజ్ ల‌భించింది. ఈ సినిమా ఇచ్చిన కిక్ తో ఆయన మరిన్ని సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఆయన స్వాతంత్ర సమరయోదుల్లో ఒకరైన ఉధమ్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ‘ఉధమ్‌సింగ్’ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. విక్కీ డోనార్ వంటి సినిమాని తెరకెక్కించిన సూజిత్ సర్కార్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటిస్తూనే ఆయన మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. భాను ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న గుజ‌రాత్ అనే హ‌ర‌ర్ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాని సంబందించిన యాక్ష‌న్ సీన్స్ షూట్ చేస్తుండగా, ఓ భారీ డోర్ ఒకటి ఊడి వచ్చి విక్కీపై ప‌డింద‌ట‌. దీంతో అత‌ని ద‌వ‌డ ఎముక విరిగిందట. వెంట‌నే ఆయనకు ప్రాధ‌మిక చికిత్స చేసి ముంబై తీసుకెళ్ళారు. ఆయ‌న ద‌వ‌డ‌కి 13 కుట్లు ప‌డ్డాయ‌ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఆన ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.  

More Related Stories