English   

రీఎంట్రీకి రెడీ అయిన కలర్స్ స్వాతి

colorswathi
2019-04-21 07:50:39

బుల్లి తెర మీద యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి క్రమక్రమంగా హీరోయిన్ గా ఎదిగింది కలర్స్ స్వాతి. పెద్దగా గ్లామరస్ పాత్రలు ఏమి చెయ్యకపోయినా నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు చేసి ఫేమస్ అయ్యింది. అయితే ఈ మధ్యనే పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లిన కలర్స్ స్వాతి టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయిందని అంటున్నారు. అయితే మెయిన్ హీరోయిన్ గా కాదు, ఇద్దరు హీరోయిన్ లలో ఒకరిగా నటించేందుకు కలర్స్ స్వాతి సిద్దమయినట్టు వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తారా ? అని  మీడియా ప్రశ్నించినపుడు ఆమె నుంచి సరియైన సమాధానం రాకపోవడంతో నటనకు పూర్తిస్తాయిలో ఆమె గుడ్‌బై చెబుతుందని భావించారు. అయితే తన కెరీర్‌ లో బెస్ట్ ఫైలిమ్గా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌ చేయన్డుందని సమాచారం. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories