English   

ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న ఉపాసన...చరణ్ విషెస్

ramcharan
2019-04-21 08:58:42

మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి కాదు అయినా సరే ఆమె తనదైన సామాజిక కార్యక్రమాలతో నితం వార్తల్లో నిలుస్తూ ఉంటారు, తాజాగా ఆమె అరుదైన గౌరవాన్ దక్కించుకున్నారు, ముందు నుండీ ఆమె చేస్తున్న సమాజిక సేవా కార్యకరమాలకు గానూ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే సామాజిక సేవా పురస్కారం అందుకున్నారు. ‘ఈ ఏడాదిలో బెస్ట్ ఫిలాంత్రఫిస్ట్ గా ఉపాసనను ఎంపిక చేశారు. ఉపాసన అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సామాజిక సేవలను గుర్తించిన దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతిభావంతులను గుర్తించి ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. అయితే అవార్డు పొందిన ఉపాసనను ఉద్ధేశించి ఫేస్‌బుక్‌లో రామ్ చరణ్ పోస్ట్ చేశారు. ప్రియమైన ఉప్సీ నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఆయన పోస్ట్ చేశారు. అలాగే ఈ అవార్డు విషయంలో ఉపాసన కూడా స్పందించారు. ఈ అవార్డును చాలా గౌరవంగా స్వీకరిస్తున్నాను. నా చుట్టూ ఉండి, ప్రతిరోజూ నాలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు నడిపిస్తున్న మంచి మనసున్న వారందరికీ ఈ అవార్డును అంకితం ఇస్తున్నాను. నా వెన్నంటే ఉండి, ఎంత గానో ప్రోత్సహిస్తున్న నా కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు’’ అని పోస్ట్ చేసింది.

More Related Stories