English   

కీర్తితో చక్కర్లు కొడుతున్న శ్రీ దేవి కూతురు

suresh
2019-04-21 09:28:55

నేను శైలజ సినిమాతో తెలుగు సినీ రంగంలో మెరిసిన భామ కీర్తి సురేష్. ఇక సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి సినిమాలో సావిత్రిగా న‌టించి తెలుగు వారి గుండెల్ల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. అయితే ఈ భామ అప్పటి నుండి మరే తెలుగు సినిమా ఒప్పుకోలేదు. అయితే తమిళ సినిమాలలో మాత్రం నటిస్తోంది. ఇక ఆమెకి ఈ మధ్యనే ఒక బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చింది. బ‌డాయి హో డైరెక్టర్ అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్ న‌టిస్తుంది. బోనీ కపూర్ నిర్మించ‌నున్న ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీ అని అంటున్నారు. అయితే ఆవిషయం ఏమో కానీ ముంబైలో కీర్తి, శ్రీదేవి కూతురు జాన్వీలు క‌లిసి చక్క‌ర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి కూతురు జాన్వీ కీర్తి సురేష్‌కి తాను ఫ్యాన్ అని, త‌న న‌ట‌నే అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇలా ఇద్దరూ కలిసి దిగిన ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. మరి ఇద్దరూ సరదాగా కలిసి తిరుగుతున్నారా ? లేక మరేదైనా సినిమా పలం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

More Related Stories