English   

మహేష్ భారీ డిజాస్టర్...ఆ బాషలోకి రీమేక్

mahesh
2019-04-21 10:10:15

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఆయనకు ఫ్లాప్ అంటే ముందు గుర్తొచ్చేది బ్రహ్మోత్సవం. ఎందుకంటే “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” వంటి సూపెర్ హిట్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకు అలంటి సినిమా మరికటి ఇస్తాడని ఛాన్స్ ఇస్తే అది పెద్ద దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ నుండి కోలుకోడానికి మహేష్ కి చాలా కాలం పడితే ఆ డైరెక్టర్ అయితే ఇప్పటికీ అడ్రెస్ లేకుండా పోయారు. అయితే ఈ సినిమాని కోలీవుడ్ లో ఓ దర్శకుడు రీమేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అందుతున్న సమచారం ఆసక్తికరంగా మారింది. తమిళ్ లో దర్శక నిర్మాత మరియు నటుడు అయిన చేరన్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆ మధ్య ఈ సినిమా చూసిన ఆయన ఈ సినిన్మలో తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చే కోణాలు ఉన్నాయని అందుకని తాను ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయాలని అనుకుంటునట్టు చెబుతున్నారు. అక్కడి నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కిస్తే సినిమా ఆడే అవకాశాలు ఉన్నాయి మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

 

More Related Stories