English   

మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ రెడీ చేశారా

chiru
2019-04-21 10:31:30

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సీమకు చెందిన స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం సైరా.ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తి కావోస్తుండడంతో మెగాస్టార్ తన తర్వాతి సినిమా వేటలో పడ్డారట. ఈ సినిమా తర్వాత కొరటాల సినిమా ఉంటుందని ఇంతకు ముందే ప్రకటించారు, అయితే ఆ సినిమా అంతా సిద్దంగా ఉండడంతో దాని తర్వాత సినిమా కూడా లైన్ లో పెట్టారని అంటున్నారు. నిజమెంతో తెలీదు కానీ రెండ్రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం  గీతా ఆర్ట్స్ బేన‌ర్‌పై నిర్మించిన అల్లు అర‌వింద్ త్వ‌ర‌లో చిరు హీరోగా రోబో డైరెక్టర్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌. అయితే అంజి సినిమా తర్వాత మళ్ళీ ఫిక్షన్ మూవీలో నటించని చిరు ఈ సినిమాని ఫిక్షన్ నేపధ్యంలో నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమాని మెగాస్టార్ పుట్టిన రోజున ప్రకటిస్తారని అంటున్నారు. అదే జరిగితే మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఆయన పుట్టిన రోజు గిఫ్ట్ రెడీ అయినట్టే చెప్పాలి.

More Related Stories