English   

రవితేజ మళ్ళీ ప్రయోగం చేస్తున్నాడా

raviteja
2019-04-21 10:58:06

కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉన్న రవితేజ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన మరో ప్రయోగం చేయనున్నాడని అంటున్నారు. ఆయన వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో  తండ్రీకొడుకులుగా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తారట, అది కూడా రెండు విభన్నమైన పత్రాలు కాగా అందులో ఒక పాత్రకి విచిత్రమైన డిజార్డర్ ఉంటుందట. ఆ ఏంటంటే కొన్ని రకాల ఎమోషన్స్ వచ్చినప్పుడు బిగుసుకుపోతాడట. ఆ సమస్య చుట్టూనే ‘డిస్కోరాజా’ కథ నడుస్తుందని, దాని చుట్టూ వినోదం, యాక్షన్‌, భావోద్వేగాలూ అల్లుకుని కధ రాసుకున్నాడట దర్శకుడు. ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజతో నెల టికెట్ సినిమా తీసిన రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే నెలలో డిస్కోరాజా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. అందుకే ఈ విషయం మీద మరింత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి.   

 

More Related Stories