English   

బీజేపీలోకి మరో స్టార్ హీరో...అక్కడి నుండి పోటీ

sunnydeol
2019-04-21 11:38:49

బాలీవుడ్ హీరో సన్నీడియోల్ రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్టు సమాచారం. అయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన బీజేపీ చీఫ్ అమిత్‌ షాతో డియోల్ భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది. పంజాబ్‌ లో శిరోమణి అకాలీదళ్‌ తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న బీజేపీ అక్కడ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగుతోంది. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో అమృత్‌సర్ ఒకటి కాగా, ఇక్కడి నుంచి ఎవరైనా సెలెబ్రిటీని బరిలోకి దింపాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఇందుకోసం టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్,  పూనం ధిల్లాన్‌, రాజేందర్‌ మోహన్‌ సింగ్‌ లాంటి ప్రముఖుల పేర్లను పరిశీలించి చివరికి వీరెవరూ కాకుండా సన్నీ డియోల్‌ ని నిలబెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయిది ఇదే విషయం మీద ఆయన స్పందించాడు. అమిత్‌షాను కలిసి ఫొటో తీసుకున్న విషయం వాస్తవమేనని  అంతకుమించి మరేమీ లేదని చెప్పాడు. దీని మీద అధికారిక ప్రకటన ఇద్దరిలో ఎవరో ఒకరు వెలువరిస్తే కానీ ఏమీ చెప్పలేం ?

More Related Stories