English   

టాలీవుడ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న కోలీవుడ్...కమిటీ ఏర్పాటు

meeto
2019-04-21 12:23:57

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం పేరిట నటి శ్రీ రెడ్డి చేసిన పోరాటానికి మద్దతు పలికిన తెలంగాణ ప్రభుత్వం సినిమా,టివి పరిశ్రమలో మహిళా ఆర్టిస్టుల మీద లైంగిక వేధింపులపై 25 మందితో కమిటీని నియమించిన సంగ‌తి తెలిసిందే. దీనిని ఆదర్శంగా తీసుకున్న తమిళ సినీ పరిశ్రమ కూడా తమకు తాముగానే ఇండస్ట్రీ వేధింపుల మీద మీటూ క‌మిటీని ఏర్పాటు చేసుకుంది. కోలీవుడ్‌లోను లైంగిక వేధింపులు, మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు ఎక్క‌వ కావ‌డంతో న‌డిఘ‌ర్ సంఘం మీటూ పేరుతో ఒక క‌మిటీని ఏర్పాటు చేసింది. నడిగర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ కమిటీకి నాజర్‌ అధ్యక్షుడిగా, విశాల్, కార్తీ, పూచీ మురుగన్‌, కుష్బు, రోహిణి, సుహాసినిలతో పాటు ఒక సామాజికవేత్త, న్యాయవాది అలా మొత్తం 8 మందిని  సభ్యులుగా నియమించారు. ఇండస్ట్రీలో లేదా సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని పడకసుఖం కోరుకునే వారిని గుట్టును బయటపెట్టడమే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. పరిశ్రమలో లైంగిక వేధింపుల‌కి పాల్పడిన వారిని ఈ కమిటీ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందట.

 

More Related Stories