English   

వేశ్య పాత్రలో శ్రద్దా దాస్ 

Shraddha Das to Play a Prostitute Role in Pure soul short film
2019-04-21 16:28:39

తెలుగులో పలు సినిమాలలో నటించిన శ్ర‌ద్దాదాస్ ఇప్పుడు కెరీర్ పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. కొత్త భామల ఎంట్రీ మొదలు ఈమెకి వచ్చే సెకండ్ హీరోయిన్ అవకాశాలు కూడా ఆగిపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుంది. అయితే ఆమె తాజాగా నటించిన ఒక ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. ఆ షార్ట్ ఫిలిం పేరు ప్యూర్ సౌల్. ఒక వేశ్య మనసును,  క‌ల్మ‌షం లేని హ్రుద‌యాన్ని జనానికి అర్ధమయ్యే రీతిలో చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఈ సినిమా. తాజాగా ఈ సినిమా అదే షార్ట్ ఫిలిం స్క్రీనింగ్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌ లో ప్రీమియర్ వేశారు. ఈ క‌థలోకి వెళితే వ‌ర్ణ అనే ఆయనప్రేమలో విఫ‌ల‌మైన ఒక మంచి పెయింట‌ర్‌ త‌న ప్యారిస్ ఎగ్జిబిష‌న్‌లో 100వ పెయింటింగ్ కోసం ఒక శ్వేత(శ్రద్దా దాస్) అనే పేరుగల వేశ్య‌ని ఎంచుకుంటాడు. అలా పెయింటింగ్ వేస్తున్న స‌మ‌యంలో వీరిద్ద‌రి మధ్య జ‌రిగిన సంభాష‌ణలో ఏమి జరిగింది ? అనేదే ఈ కధాంశం. త్వరలోనే ఇది యూట్యూబ్ లో విడుదల కానుంది.

More Related Stories