English   

శ్రీలంక పేలుళ్లు...త్రుటిలో తప్పించుకున్న రాధిక

radika
2019-04-21 18:38:27

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ దాడిలో 165 మంది మృతి చెందగా, 500 మందికి పైగా గాయాలయ్యాయి. ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న భక్తులను లక్ష్యంగా పెట్టుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్‌ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. షాంగ్రి లా హోటల్‌, కింగ్స్‌ బరీ హోటల్‌లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారట. పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేసింది. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. ఆమె బయటికి వెళ్లిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని రాధిక ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ‘ఓ మై గాడ్‌. కొలంబోలోని సిన్నామన్‌ హోటల్‌ నుంచి నేను బయటికి వచ్చిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. నేను నమ్మలేకపోతున్నాను’ అని రాధిక తెలిపారు.  

More Related Stories