English   

ఎన్టీఆర్ తో జెర్సీ డైరక్టర్...లాక్ అయినట్టేనా

jrntr
2019-04-21 19:08:43

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా ‘జెర్సీ’. క్రికెట్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో మిడిల్‌ ఏజ్‌ క్రికెటర్‌గా కనిపించిన నానీ నట విశ్వరూపాన్ని చూపాడు. ఇదంతా ఒకెత్తు అయితే ఒక స్పోర్ట్స్ సినిమాని  ఎమోషనల్‌ సీన్స్‌ తో సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్లాడంటూ జెర్సీ దర్శకుడిని కూడా అభినందిస్తున్నారు. తాజాగా ఈ డైరెక్టర్ ని ఇద్దరు స్టార్ హీరోలు తమ పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. వారే ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు. అయితే ఇవి ప్రశంసలు వరకూ ఆగలేదని కూడా టాక్ వినిపిస్తోంది, ఆయనతో సినిమా చేయడానికి ఇద్దరూ ఇంటరెస్ట్ చూపిస్తున్నారని టాక్. అయితే బన్నీ ఇప్పటికే మూడు సినిమాలు ఒప్పేసుకున్నాడు. సో ఆయన మరో రెండేళ్ళు దాకా దొరకడం కష్టమే అందుకే, గౌతం ఎన్టీఆర్ ని కలిసి కధ కూడా వినిపించాడని అంటున్నారు. ఈ కధ నచ్చడంతో ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పేసాడని అంటున్నారు. అయినా ఎన్టీఆర్ ఖాళీ అవ్వాలంటే 2020 మే వరకు ఆగాలి. ఈలోపు చెప్పిన కధన్ని స్క్రిప్ట్ రూపంలో తెమ్మని ఎన్టీఆర్ చెప్పారట. సో ఆయన తర్వాత సినిమా గౌతమ్ తో ఓకే అయినట్టే అన్నమాట.

More Related Stories