English   

సీత వెనక్కు వెళుతోంది అందుకే

sita
2019-04-21 19:44:33

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న మూవీ సీత. నేనేరాజు నేనే మంత్రి తరువాత తేజ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కాబట్టి దీని మీద కాస్త అంచనాలు బాగానే ఉన్నాయి. అదీ కాక బెల్లంకొండ - కాజల్ రెండో సారి జంటగా నటిస్తుండడంతో ఈ సారి అయినా హిట్ పడుతుందో లేదో అనే టెన్షన్ కూడా మేకర్స్ లో ఉంది. ఈ సినిమా ఈ నెల 25న విడుద‌ల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా వాయిదా ప‌డిన‌ట్లు చెబుతున్నారు. ఎందుకంటే అదే రోజు ఎవెంజర్స్ -ఎండ్ గేమ్ అనే హాలీవుద్ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతుండడంతో పాటు ఇప్పటికే జెర్సీ, కాంచన 3, మజిలీ, చిత్రలహరి సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుండడంతో సీత సినిమాకి థియేటర్లు కరువయ్యాయట‌. అందుకే ఈ సినిమా విడుదల వచ్చే నెల మొదటి వారానికి వాయిదా వేశారని ఇన్ సైడ్ సమాచారం.  

More Related Stories