English   

సూర్య వలన వెనక్కు వెళ్తున్న విజయ్ !

 Vijay Devarakonda
2019-04-22 11:28:21

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం విడుదల వాయిదా పడునున్నట్టు వార్తలు వస్తున్నాయి. వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మార్కెట్ పెరగడంతో ఈ సినిమా కేవలం టాలీవుడ్‌ లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ చిత్ర సీమలో మొత్తం నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. మొదట ఈ సినిమా మే 31న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, అదే రోజున సూర్య నటించిన ఎన్జీకే విడుదలవుతున్నందున ఈ చిత్రాన్ని వాయిదా వేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో జూలై 19న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. గీత గోవిందం సినిమాలో నటించి క్యూట్ పెయిర్ గా అలరించిన జోడీ మళ్ళీ రొమాన్స్‌కి రెడీ కావడంతో ఇటు తెలుగుతో పాటు కన్నడ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై సినిమాకి హైప్ తీసుకువచ్చింది. అయితే సూర్యకి కూడా రెండు తెలుగు బాషలలో మార్కెట్ ఉండడంతోనే విజయ్ సినిమా వెనక్కు తగ్గుతున్నట్టు సమాచారం. 

More Related Stories