English   

ఈసారి బిగ్ బాస్ హోస్ట్ హీరోయిన్ అట !

Anushka
2019-04-22 11:43:49

బాలీవుడ్ బుల్లి తెరలో బిగ్ బాస్ రియాలిటీ షోకి విశేష ఆదరణ లభించడంతో దానిని తెలుగులోనూ రెండు సీజన్స్ నడిపి సక్సెస్ అయ్యారు. దీంతో మూడో సీజన్ కి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ సీజన్ హోస్ట్ కోసం ఇంకా వెతుకూనే ఉన్నారు నిర్వాహకులు. నాని, ఎన్టీఆర్, రానా, విజయ్ దేవరకొండ, చిరంజీవి, నాగార్జున ఇలా చాలా పేర్లు వినిపించినప్పటికీ.. కొత్తగా ఈసారి హీరోలు కాకుండా హీరోయిన్‌ హోస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం నడుస్తోంది. విచిత్రంగా అనుష్క పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ షోలో ఏ భాషలో అయినా మగవాళ్ళతోనే హోస్ట్ గా చేయించారు కానీ మొదటి సారి తెలుగులో ఎందుకు హీరోయిన్ తో హోస్టింగ్ చేయించకూడదన్న ఆలోచనతో అనుష్కను సంప్రదిస్తే ఆమె కూడా ఓకే చెప్పిందని అంటున్నారు. బాగమతి తరువాత అనుష్క ఏ సినిమా కు సంతకం చేయలేదు. తాజాగా ఓ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్టు సమాచారం. అయితే స్వతహగా కన్నడ భామ అయిన అనుష్క తెలుగు షో చేయగలదా, నాని ఎన్టీఆర్ లాగా సమయస్పూర్తితో మాట్లాడగలదా అంటే డౌటే మరి.

More Related Stories