English   

మద్యం తాగి మ్యాచ్ కి...చుక్కలు చూపించిన యాంకర్ బ్యాచ్ 

 Prashanthi
2019-04-22 12:04:30

ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్‌ లో భాగంగా నిన్న హైదరాబాద్-కోల్‌కతా మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగినసంగతి తెలిసిందే. అయితే దానికి మద్య్తం తాగి వెళ్ళిన ఒక బ్యాచ్ మద్యం మత్తులో హల్చల్ చేశారు. అయితే ఇందులో కేవలం పురుషులు మాత్రమే ఉన్నారనుకోకండి అబ్బాయిలకి మేమేమాత్రం తగ్గమంటూ అమ్మాయిలు కూడా తప్ప తాగి రచ్చ చేశారు. ముద్దులు పెట్టుకుంటూ కౌగిలింతలతో పక్కవారికి ఏవగింపు కలిగించారు, ఎన్ని సార్లు చెప్పినా వీరు వినకపోవడంతో వీరి మీద ఒక వ్యక్తి కంప్లయింట్ ఇచ్చారు.  దీంతో ఓ ఛానల్ యాంకర్ ప్రశాంతి  సహా పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్రెడ్డి, సురేష్, వేణుగోపాల్పై కేసునమోదు చేశారు. అలాగే యువకుడి ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 341, 188, 506ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సీసీ కెమెరా పుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. 
 

More Related Stories