English   

గబ్బర్ సింగ్ యాక్టర్ కి రోడ్డు ప్రమాదం !

 gabbar singh
2019-04-22 14:13:36

ఫ్లాపులతో సతమతం అవుతున్న పవన్ కల్యాణ్ కెరీర్ ని గబ్బర్ సింగ్ సినిమా ఒక మలుపు తిప్పింది. ఆ సినిమాలో విలన్ కు చెందిన గ్యాంగ్ తో పవన్ చేసే అంత్యాక్షరి సీన్ అయితే మరిచిపోలేం. ఆ సినిమాకు ఆ సీనే హైలెట్ అని చెప్పుకోవచ్చు. గ్రూప్ లోని వ్యక్తులంతా ఇతర హీరోల ఇమిటేషన్ చేయడం, సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం.. ఇలా సరదాగా ఉంటుంది ఆ సీన్. అయితే ఆ గ్రూప్ లో రాజశేఖర్ లా డ్యాన్స్ చేసి రాజశేఖర్ ను ఇమిటేట్ చేసిన ఆంజనేయులు అనే నటుడికి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ఈ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందిరానగర్‌లో నివసించే ఆంజనేయులు భార్యతో కలిసి శనివారం రాత్రి ద్విచక్రవాహంపై గచ్చిబౌలి బయలుదేరారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వీరి బైక్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆంజనేయులు కాళ్లు, చేతులకు గాయాలు కాగా, ఆయన భార్య కూడా గాయపడింది. ఘటనపై ఆంజనేయులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

More Related Stories