English   

దిల్ రాజు నాగ చైతన్య క్రేజీ కాంబినేషన్ లో జెర్సీ భామ !

 Shraddha Srinath
2019-04-22 16:22:13

చాన్నాళ్ళ బట్టి హిట్స్ లేక సతమతం అవుతున్న నాగచైతన్యకి మజిలీ రూపంలో ఒక బూస్ట్ దొరికింది. దీంతో ఆయన ఎనలేని ఉత్సాహంతో సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే మేనమామ వెంకీతో వెంకీ మామ సెట్స్ మీద ఉన్న ఈ అక్కినేని అందగాడు, నాన్నతో కలిసి త్వరలోనే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సోగ్గాడే చిన్నినయన చేయనున్నాడు. దాంతో పటు నూతన దర్శకుడు శశితో ఓ సినిమా ఒప్పుకున్నాడని అంటున్నారు. ‘దిల్‌’ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాలో కథానాయికగా ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. జెర్సీ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్. కన్నడ లో యు టర్న్ సినిమా తో అరంగేట్రం చేసిన శ్రద్ధ, ఆ తర్వాత అనేక కన్నడ సినిమాలలో నటించింది. కొన్ని తమిళ సినిమాల్లో కూడా మెరిసిన శ్రద్ధ ఇప్పుడు జెర్సీ విజయం తో అందరి దృష్టి ని ఆకర్షించింది. అందుకే దిల్ రాజు ఆమెను తన సినిమాలో బుక్ చేశారని అంటున్నారు. దీని మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More Related Stories