English   

ఈ ఏడాది వార్ వన్ సైడ్...టెన్షన్లో థియేటర్ యజమానులు !

Mahesh
2019-04-22 17:29:39

వేసవిలో భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు విడుదలవడం సహజం. కానీ ఈ ఏడాది స్టార్ హీరోలంతా వేసవి మార్కెట్ర్ ని వదిలేయడం కాస్త చర్చనీయాంశంగానే మారింది. వేనిజనిక్ సవి సెలవుల్లో భారీ బడ్జెట్ సినిమాలను, క్రేజ్ న్న సినిమాలను వదిలి బాగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు చాలామంది దర్శకనిర్మాతలు. మరి ఈసారి మహేష్ బాబు మహర్షి సినిమాతోనే ప్రేక్షకులు సరిపెట్టుకోవాలి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహర్షి సినిమా మీద ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి మే నెల ఒకటవ తారీకున యువ హీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం, అలాగే ప్రభుదేవా, తమన్నాలు నటించిన అభినేత్రి 2 రిలీజ్ అవనున్నాయి, కానీ ఇవి చిన్న సినిమాలే కావడం మహేష్ కి కలిసొచ్చే అంశం. గత ఏడాది అయితే మార్చి 30న రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఏప్రిల్ లో మహేష్ బాబు – కొరటాల శివ కాంబోలో క్రేజీగా తెరకెక్కిన భరత్ అనే నేను కూడా హిట్ అయ్యింది. మరో స్టార్ హీరో అల్లు అర్జున్ మే మొదటి వారంలోనే నా పేరు సూర్యతో వచ్చినా అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ ఏడాది వార్ వాన్ సైడ్ అయినట్టే. స్టార్ హీరోల సినిమాలే కష్టంగా ఆడుతున్న ఈ రోజుల్లో చిన్న సినిమాల మీద ప్రజలు పెద్ద ఆసక్తి చూపరు. సినిమా అధిరిపోతే తప్ప. మరి ఈ విషయంలో ఇప్పటికే ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఓకే ఒక్క స్టార్ హీరో సినిమా అంటే థియేటర్ యాజమాన్యాలు కూడా భయపడుతున్నారు ఎక్కడ ఈగలు తోలుకోవాల్సి వస్తుందో అని ? చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories