English   

నాని బాబు...లవ్యూ అంతే...జక్కన విషెస్ 

Rajamouli
2019-04-22 17:44:25

నాని క్రికెటర్ గా నటించిన జెర్సీ ఈ నెల 19వ తేదీన థియేటర్లలోకి వచ్చింది.  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవుకానీ టీజర్ .. ట్రైలర్ బయటికి వచ్చాక ఒక్కసారిగా ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి పెరిగింది. విడుదల తరువాత ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. సినీ ప్రముఖులుఈ సినిమా చూసి, టీమ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆ జాబితాలోకి తాజాగా రాజమౌళి కూడా చేరారు. ఈ సినిమా చూసిన రాజమౌళి స్పందిస్తూ "సినిమా చాలా బాగుంది .. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అద్భుతంగా తెరకెక్కించాడు. సన్నివేశాలను రాసుకున్న తీరు తెరపై వాటిని ఆవిష్కరించిన తీరు హృదయానికి హత్తుకునేలా వున్నాయి. నాని తన పాత్రలో ఇమిడిపోయి ప్రతి సన్నివేశాన్ని పండించిన తీరు బాగుంది, నాని ‘బాబు’..జస్ట్‌ లవ్యూ అంతే..’ అంటూ రాజమౌళి సినిమా మీద ప్రశంసల జల్లులు కురిపించారు.

More Related Stories