English   

జెర్సీ సినిమా మూల కధ...ఆ క్రికెటర్ దేనా ?

Jersey
2019-04-22 18:02:17

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. క్రికెట్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల చేత కూడా ప్రశంశలు అందుకుంటోంది. నిజానికి ఈ సినిమా మొదలు అయినప్పటి నుండి ఈ సినిమా  రామన్ లాంబా  అనే ఆటగాడి జీవిత కధ ఆధారంగా తెరకేక్కుతుందని, ఒక రకంగా అది ఆయన బయోపిక్ అని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని చిత్ర టీమ్ ఖండించింది కూడా, అయితే సినిమా చూశాక ఇది ఆయన జీవిత కాదు కానీ ఆయన జీవితం నుండి తీసుకోబడింది అని మాత్రం అర్ధం అయింది. రామన్ 1960 జనవరి 2న ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జన్మించాడు. లంబా చిన్నతనం నుండే క్రికెట్ పై ప్రేమతో క్రికెటర్గా మారాలనుకుంటాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా విజయం వరించదు. ఇక అయిపోయినిది అనుకున్న సమయమ్లో 1980లో తన శక్తినంతా కూడగట్టి రంజీ జట్టులో స్థానం సంపాదిస్తాడు. రంజీల్లో రాణిస్తున్న తనకు 1986 ఆసియా కప్ రూపంలో అనుకోకుండా జాతీయ జట్టులో చేరడం జరుగుతుంది. 11మంది ఉన్న తుది జట్టులో స్థానం దొరకక 12వ ఆటగాడిగా ఆ ఛాన్స్ వస్తే ఆయన దానిని వదులుకొని రామన్ తన ప్రేయసి ఐరిష్ సంతతికి చెందిన కిమ్ మిచెల్ తో మూడు సంవత్సరాలు సహజీవనం చేసిన అనంతరం ఒక్కటవుతారు. అలా జాస్మిన్, కమ్రాన్ అనే ఇద్దరు సంతానం పుట్టాక ఆయన జాతీయ జట్టులో స్థానం సంపాదించడం, రాణించడం జరుగుతుంది. అలా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతుండగా తలకు తీవ్రగాయమై మైదానంలోనే కుప్పకూలి చనిపోతాడు. జెర్సీలో ఇలా కాకపోయినా దగ్గర పోలికలు ఉండడంతో ఈ సినిమా ఆయన జీవితం యొక్క ప్రేరణతో వచ్చిందేనని అంటున్నారు విశ్లేషకులు.

More Related Stories