English   

రాజ్ తరుణ్ కొత్త సినిమా...క్లారిటీ ఇవ్వలేదు

raj
2019-04-22 20:05:37

యంగ్ హీరో రాజ్ తరుణ్ చాన్నాళ్ళ నుండి హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. చివరిగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన 'లవర్' పై నమ్మకం పెట్టుకున్నా ఆ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. అల చాయా గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చాడు. మళ్ళీ రాజుగారి బ్యానర్ లోనే రాజ్ తరుణ్ కొత్త సినిమా ఈరోజే లాంచ్ అయింది. ఆడు మగాడ్రా బుజ్జి ఫేమ్ జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఈ సినిమాలో నటించనున్నాడు. ఇద్దరి లోకం ఒకటే అనే టైటిల్‌ తో ఈ సిన్మా తెరకెక్కింది. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. రైటర్ అబ్బూరి రవి మాటలు అందిస్తుండగా సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయబోతున్నారు. వరుస విజయాలతో డీలాపడ్డ రాజ్ తరుణ్ ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. అయితే ఈ సినిమా మహేష్ మేనల్లుడితో ఆపేసిన కధ ఏనా ? లేక ఇది కొత్త కధా అనేది తేలాల్సి ఉంది.

More Related Stories